ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

మహారాజా చందు లాల్

జయంతి · 1766 మూలం

పానుగంటి లక్ష్మీ నరసింహరావు

వర్ధంతి · 1940 మూలం

అమ్జద్ హైదరాబాదీ

జయంతి · 1888 మూలం

దినోత్సవాలు

  • గ్లోబల్ ఫ్యామిలీ డే అంతర్జాతీయ శాంతి, సోదరభావ సందేశంతో నూతన సంవత్సర ఆరంభ దినం మూలం
  • సైనిక వైద్య దళ (ఆర్మీ మెడికల్ కార్ప్స్) స్థాపక దినోత్సవం జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1923 రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు. మూలం
  • 1973 'సీతా ఔర్ గీతా' రీమేక్ 'గంగ మంగ'లో వాణిశ్రీ రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2004 టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు. మూలం
  • 2015 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 630 ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు. మూలం
  • 1651 స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం. మూలం
  • 1707 పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు. మూలం
  • 1804 హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది. మూలం
  • 1818 బీమా కోరేగావ్ తిరుగుబాటు (యుద్ధం) జరిగింది. మూలం
  • 1877 ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు. భారత్ మూలం
  • 1877 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. భారత్ మూలం
  • 1899 క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • 1906 బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు. భారత్ మూలం
  • 1925 అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు. మూలం
  • 1939 బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు. మూలం
  • 1948 విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది. భారత్ మూలం
  • 1953 విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది. మూలం
  • 1956 సూడాన్ స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • 1958 యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది. మూలం
  • 1960 కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • 1971 అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది. మూలం
  • 1972 మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది. మూలం
  • 1973 ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం
  • 1978 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది. భారత్ మూలం
  • 1981 గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది. మూలం
  • 1984 బ్రూనై స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • 1985 ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది. మూలం
  • 1986 సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది. మూలం
  • 1993 చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది. మూలం
  • 1994 ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది. మూలం
  • 1995 GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది. మూలం
  • 1998 యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది. మూలం
  • 1999 యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది. మూలం
  • 2002 ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు. మూలం
  • 2006 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది. మూలం
  • 2007 ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు. మూలం
  • 2024 కృష్ణబిలాలు, ఎక్స్-రే ధ్రువణ అధ్యయనానికి ఇస్రో ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ ద్వారా ప్రయోగించింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1766 మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845). మూలం
  • 1840 బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900). మూలం
  • 1888 అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 1961). మూలం
  • 1890 నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (మ.1978). భారత్ మూలం
  • 1892 మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942). భారత్ మూలం
  • 1894 సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త. మూలం
  • 1902 బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1977). మూలం
  • 1905 లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు. భారత్ మూలం
  • 1908 లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (మ.1988). భారత్ మూలం
  • 1909 చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996). మూలం
  • 1909 దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (మ.1949). భారత్ మూలం
  • 1911 ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు. మూలం
  • 1920 మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997). మూలం
  • 1928 మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974). మూలం
  • 1928 అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016). మూలం
  • 1929 ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003). మూలం
  • 1938 గణపతి తనికైమోని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986). భారత్ మూలం
  • 1938 తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత. మూలం
  • 1939 సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు. మూలం
  • 1941 భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (మ.2018). మూలం
  • 1942 సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి.పలు దక్షిణాది భాషల్లో కూడా నటించిన నటి (మ.2014). మూలం
  • 1943 రఘునాథ్ అనంత్ మషెల్కర్, భారతీయ శాస్త్రవేత్త. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. భారత్ మూలం
  • 1946 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. భారత్ మూలం
  • 1946 పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూలం
  • 1948 షేక్‌ బడేసాహెబ్‌ తెలుగు రచయిత. మూలం
  • 1948 మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (మ.2020). మూలం
  • 1948 ఫగు చౌహాన్, మేఘాలయా గవర్నర్. మూలం
  • 1951 వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు. మూలం
  • 1951 అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి. మూలం
  • 1952 నానా పటేకర్, నటుడు. మూలం
  • 1952 గౌరీ శంకర్ బైసెన్, రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు. భారత్ మూలం
  • 1953 సల్మాన్ ఖుర్షీద్, మాజీ కేంద్రమంత్రి. మూలం
  • 1954 శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. భారత్ మూలం
  • 1954 తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు. భారత్ మూలం
  • 1959 శుభా ముద్గల్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • 1961 దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త. మూలం
  • 1961 ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మూలం
  • 1962 మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999). మూలం
  • 1963 అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త. మూలం
  • 1966 వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు. మూలం
  • 1970 ఊహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల నటి. మూలం
  • 1971 కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016). భారత్ మూలం
  • 1971 జ్యోతిరాదిత్య సింధియా, రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి. మూలం
  • 1974 కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి. మూలం
  • 1978 విద్యా బాలన్, హిందీ నటి. భారత్ మూలం
  • 1978 ఉజ్మా గొండాల్, పాకిస్తాన్ వికెట్ కీపర్, మాజీ క్రికెటర్. మూలం
  • 1978 పరమహంస శ్రీ నిత్యానందా. మూలం
  • 1979 డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1980 మాలోతు కవిత, ఎంపీ (మహబూబాబాద్), మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. మూలం
  • 1980 సానా యాదిరెడ్డి, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత. మూలం
  • 1980 తేజస్విని కొల్హాపురే, భారతీయ నటి, మోడల్. భారత్ మూలం
  • 1981 అస్మా ఫర్జాంద్, పాకిస్థాన్ మాజీ మహిళా క్రికెటర్, వికెట్ కీపర్. మూలం
  • 1982 ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె. భారత్ మూలం
  • 1984 సయాలి భగత్, చలన చిత్ర నటి. మూలం
  • 1987 గియా కొప్పోలా, అమెరికన్ సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత. మూలం
  • 1990 సోనాలి బెంద్రే, హిందీ, మరాఠీ, దక్షిణ భారత నటి, మోడల్. భారత్ మూలం
  • 1991 శుభ్ర అయ్యప్ప, తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల నటి. మూలం
  • 1992 డేన్ క్లీవర్, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. మూలం

మరణాలు

  • 1748 జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త. మూలం
  • 1775 అహమ్మద్ షా బహదూర్, 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725). మూలం
  • 1782 జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు. మూలం
  • 1894 హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857). మూలం
  • 1896 విలియం డౌన్స్, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. (జ.1843). మూలం
  • 1940 పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865). మూలం
  • 1955 శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు. మూలం
  • 1964 శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888). మూలం
  • 1964 ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1896). మూలం
  • 1968 వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత. మూలం
  • 1994 చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915). మూలం
  • 1995 యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త. మూలం
  • 2001 ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920). మూలం
  • 2007 డూండీ, తెలుగు సినిమా నిర్మాత. మూలం
  • 2007 టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912). మూలం
  • 2008 ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి. భారత్ మూలం
  • 2009 కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947). మూలం

సినిమా

«సోగ్గాడే చిన్నినాయనా»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 1965 'సుమంగళి' చిత్రం విడుదలైంది. మూలం
  • 1969 'మూగ నోము' చిత్రం విడుదలైంది. మూలం
  • 1973 'గంగ మంగ' చిత్రం విడుదలైంది. మూలం
  • 1987 'ఆత్మ బంధువులు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1988 'సంసారం' చిత్రం విడుదలైంది. మూలం
  • 1992 'లాఠీ' చిత్రం విడుదలైంది. మూలం
  • 2016 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం విడుదలైంది. మూలం
  • 2022 'దిశ ఎన్కౌంటర్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2026 'సైక్_సిద్ధార్థ' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు. మూలం
  • రహదారి భద్రతా దినోత్సవం. మూలం
  • అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం. మూలం
  • సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం. మూలం
  • గ్లోబల్ ఫ్యామిలీ డే. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: వాణిశ్రీ tewiki:వాణిశ్రీ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  5. వికీడేటా: సుమంగళి (Q28179933) wikidata:Q28179933 · CC0 1.0
  6. వికీడేటా: మూగ నోము (Q16343640) wikidata:Q16343640 · CC0 1.0
  7. వికీడేటా: గంగ మంగ (Q15696940) wikidata:Q15696940 · CC0 1.0
  8. వికీడేటా: ఆత్మ బంధువులు (Q29026073) wikidata:Q29026073 · CC0 1.0
  9. వికీడేటా: సంసారం (Q25097089) wikidata:Q25097089 · CC0 1.0
  10. వికీడేటా: లాఠీ (Q16250672) wikidata:Q16250672 · CC0 1.0
  11. వికీడేటా: సోగ్గాడే చిన్నినాయనా (Q18379056) wikidata:Q18379056 · CC0 1.0
  12. వికీడేటా: దిశ ఎన్కౌంటర్ (Q104882474) wikidata:Q104882474 · CC0 1.0
  13. వికీడేటా: సైక్_సిద్ధార్థ (Q137843190) wikidata:Q137843190 · CC0 1.0
  14. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0