ఫిబ్రవరి 12 శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
మూలం
మార్చి 9 స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా.
మూలం
ఏప్రిల్ 12 రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
మూలం
మే 5 అలన్ షెపర్డ్, మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు (రోదసీ నౌక పేరు: ఫ్రీడం 7).
మూలం
మే 11 హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
మూలం
మే 24 అమెరికా పంపిన 'ఎక్స్‌ప్లోరర్ (12) ' ఉపగ్రహం భూకక్ష్యను చేరలేక, పడిపోయింది.
మూలం
జూలై 4 సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శివశక్తి దత్తాకు జన్మించారు.
మూలం
జూలై 12 పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
మూలం
జూలై 21 మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం).
మూలం
జూలై 29 ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కుముదం విడుదలై జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.
మూలం
ఆగస్టు 6 రష్యా వ్యోమగామి (కాస్మోనాట్) మేజర్ ఘెర్మన్ టితోవ్ రోదసీలో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
మూలం
ఆగస్టు 9 కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రం జగదేకవీరుని కథ విడుదలై విజయం సాధించింది.
మూలం
ఆగస్టు 10 అమెరికా సైన్యం మొట్టమొదటిసారిగా వియత్నాం దక్షిణ ప్రాంతంలో ఏజెంట్ ఆరెంజ్(ఎఒ)/ డయాక్సిన్ను చల్లడం ప్రారంభించి, 1971 మధ్య కాలానికి, నాల్గింట ఒక వంతు భూభాగంలో 61 శాతం విషపూరిత రసాయనాలు, 366 కిలోల డయాక్సిన్‌తో ఉన్న సుమారు ఎనిమిది కోట్ల లీటర్ల ఏజెంట్ ఆరంజ్ ను చల్లింది. దక్షిణ వియత్నాం పర్యావరణ వ్యవస్థను నాశనం చేసి, 48 లక్షల మంది వియత్నామీయులు ఏజెంట్ ఆరెంజ్ బారిన పడేలా చేసింది. ఆ దుష్ఫలితాలు రెండవ, మూడవ తరాలవారితో సహా సుమారు 30 లక్షల మంది ఇప్పటికీ బాధపడుతున్నారు.
మూలం
ఆగస్టు 13 బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
మూలం
ఆగస్టు 15 తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు.
మూలం