జనవరి 1 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
మూలం
జనవరి 19 NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడింది.
మూలం
జనవరి 26 టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
మూలం
జనవరి 29 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.
మూలం
మే 10 టైటానిక్ నౌక ప్రమాదంలో బతికి బట్ట కట్టిన, చివరి అమెరికా పౌరుడు మరణించాడు.
మూలం
మే 10 సెక్స్ వెబ్ సైట్లకు.xxx డొమైన్ పేరు తగిలించాలన్న విన్నపాన్ని ఐ.సి.ఎ.ఎన్.ఎన్ ICANN తిరస్కరించింది.
మూలం
మే 16 భారతదేశం అగ్ని-III బాలిస్టిక్ క్షిపణి యొక్క ప్రయోగ పరీక్షను, వాయిదా వేసింది.
భారత్
మూలం
మే 18 నేపాల్ రాజు యొక్క అధికారాలను తగ్గించటానికి, నేపాల్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది.
భారత్
మూలం
ఆగస్టు 13 అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం, టొరంటోలో ప్రారంభమయ్యింది.
మూలం
ఆగస్టు 15 ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.
మూలం
ఆగస్టు 15 శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది.
మూలం
ఆగస్టు 18 నెట్‌వర్క్ సమస్య మూలంగా, వికిమీడియా సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
మూలం
సెప్టెంబరు 1 పద్దెనిమిదవ లా కమిషన్ ను, (ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III) తేది 2006 సెప్టెంబర్ 1 న ఏర్పాటు చేసారు. ఇది 2009 ఆగష్టు 31 వరకు అమలులో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అధ్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మణన్ ను నియమించారు.
మూలం
సెప్టెంబరు 15 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానా లో ప్రారంభమైనది.
మూలం
సెప్టెంబరు 23 తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కేసీఆర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మూలం
అక్టోబరు 1 పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది.
మూలం
అక్టోబరు 2 అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది.
భారత్
మూలం
అక్టోబరు 5 కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగుల జీత భత్యాలను సవరించటానికి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఛైర్‌మన్ గా ఆరవ వేతన సంఘాన్ని నియమించింది. 18 నెలలలో నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియా, జె.ఎస్. మాథుర్ లు సభ్యులుగా, శ్రీమతి సుష్మా నాథ్, మెంబర్-సెక్రటరీగా ఉన్నారు.
మూలం
అక్టోబరు 30 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది. మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, చదవాలంటే, ఇక్కడ నొక్కండి. ఇది హోమ్ మంత్రిత్వశాఖ వెబ్‍సైట్ లో ఉంది.
మూలం
జనవరి 17 శాంతకుమారి, పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు. (జ.1920).
మూలం
ఫిబ్రవరి 4 రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1937).
భారత్
మూలం
మార్చి 13 వల్లo నరసింహారావు, నాటక రంగ కళాకారుడు, సినిమా నటుడు.
మూలం
మార్చి 26 అనిల్ బిశ్వాస్, రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు). (జ.1944).
భారత్
మూలం
మార్చి 26 దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917).
మూలం
మార్చి 28 వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911).
భారత్
మూలం
ఏప్రిల్ 12 రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929).
భారత్
మూలం
ఏప్రిల్ 19 సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, ప్రసిద్ధి స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1909).
మూలం
ఏప్రిల్ 29 జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.1908).
మూలం
మే 3 ప్రమోద్ మహాజన్, భారత రాజకీయవేత్త. (జ. 1949).
భారత్
మూలం
మే 6 తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).
మూలం
మే 6 బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).
మూలం
జూన్ 4 బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త (జ.1932).
మూలం
జూన్ 19 ఐరన్ లెగ్ శాస్త్రి , తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
మూలం
జూలై 1 కొరటాల సత్యనారాయణ,ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ముఖ్యుడు. (జ.1923).
మూలం
జూలై 8 రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908).
మూలం
ఆగస్టు 4 నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931).
భారత్
మూలం
ఆగస్టు 15 జి. వి. సుబ్రహ్మణ్యం, వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935).
మూలం
ఆగస్టు 18 కొండపల్లి పైడితల్లి నాయిడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు (జ.1930).
భారత్
మూలం
ఆగస్టు 27 హృషికేష్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922).
భారత్
మూలం
ఆగస్టు 28 డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920).
మూలం