మే 14 'డౌ జోన్స్' 2821.53 స్థాయిని తాకి, రికార్డ్ ను నెలకొల్పింది.
మూలం
మే 19 మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.
మూలం
మే 20 హబుల్ స్పేస్ టెలిస్కోప్ మొదటి ఛాయాచిత్రాలను భూమికి పంపింది.
మూలం
జూన్ 8 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
మూలం
జూన్ 21 ఇరాన్లో సంభవించిన భారీ భూకంపంలో 40వేల మంది మృతిచెందారు.
మూలం
జూలై 1 జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
మూలం
జూలై 16 భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.
మూలం
జూలై 20 లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది.
మూలం
జూలై 21 తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు.
మూలం
ఆగస్టు 2 ఈ రోజు ఉదయాన్నే, ఇరాక్, లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది.
మూలం
ఆగస్టు 2 ఇరాక్ కువైట్ను ఆక్రమించగానే, ఎమీర్ సౌది అరేబియా పారిపోయాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాకీ అక్రమణను ఖండించింది. అంతే కాదు, ఇరాక్ మీద పూర్తి దిగ్బంధం విధించింది.
మూలం
ఆగస్టు 3 నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది.
మూలం
ఆగస్టు 10 అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్ర గ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్ర గ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.
మూలం
ఆగస్టు 13 ఇరాక్, కువాయిట్ని ఆక్రమించినందుకు, అమెరికా అధ్యక్షుడు బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. సౌదీ అరేబియా లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ కాలం ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
మూలం
ఆగస్టు 13 కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు, వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్, $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, లండన్ లోని అరబ్ బ్యాంకర్లు నివేదించారు.
మూలం
సెప్టెంబరు 1 సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు కడపలో స్వర్గస్థులయ్యారు.
మూలం
అక్టోబరు 1 పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజారిటీ కోసం లోక్‌సభలో మొదటి దశలో విఫలమైంది.
భారత్
మూలం
అక్టోబరు 1 జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
భారత్
మూలం
అక్టోబరు 1 మండలం కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
భారత్
మూలం
అక్టోబరు 3 పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
మూలం
అక్టోబరు 16 నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది.
భారత్
మూలం
అక్టోబరు 23 అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.
భారత్
మూలం
నవంబరు 10 భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
భారత్
మూలం
నవంబరు 21 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.
మూలం
జననాలు
జనవరి 1 సోనాలి బెంద్రే, హిందీ, మరాఠీ, దక్షిణ భారత నటి, మోడల్.
భారత్
మూలం
జనవరి 14 మణి రవి వాల్మీకి, వాల్మీకి బోయ ఎస్టీ సాధన ఉద్యమకారుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు, తెలుగుదేశం పార్టీ వాల్మీకి బోయ సాధికార కమిటీ స్టేట్ డైరెక్టర్.
మూలం
సెప్టెంబరు 17 బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. విలేకరిగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషించారు. అధ్యాపకునిగా ఎందరికో విద్య ను అందించారు.
మూలం