జనవరి 5 విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
జనవరి 12 అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ ను ఇలా తీశాడు.
జనవరి 18 –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
మార్చి 24 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
ఏప్రిల్ 6 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
మే 14 అమెరికాలో, 'మే' నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన రోజు (-10º ఫారిన్‌హీట్ - క్లైమాక్స్ సి.ఒ).
మే 28 తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాలపాడులో జన్మించారు.
జూలై 7 భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు.
భారత్
ఆగస్టు 30 ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాలలో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువే ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
జననాలు
జనవరి 14 సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (మ.1982).
భారత్
జనవరి 23 ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1964).
ఫిబ్రవరి 29 మొరార్జీ దేశాయి, భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి.
భారత్
మార్చి 10 నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968).
భారత్
మార్చి 17 మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976).
మే 20 అబ్బూరి రామకృష్ణారావు, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది (మ.1979).
మే 28 సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953).
జూన్ 13 కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964).
జూన్ 23 రట్టిహళ్లి నాగేంద్రరావు, కన్నడ, తెలుగు, తమిళ నటుడు (మ. 1977).
జూన్ 24 జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (మ.1970).
జూలై 16 ట్రైగ్వె లీ, మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ (1946-52).
జూలై 30 పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996).
భారత్
ఆగస్టు 5 తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990).
ఆగస్టు 8 బాబా శివానంద్‌జీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగా గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
భారత్
అక్టోబరు 6 కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978).
నవంబరు 8 పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972).
డిసెంబరు 5 స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).
డిసెంబరు 7 కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1990).
భారత్
డిసెంబరు 11 గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత.
మరణాలు
జనవరి 1 విలియం డౌన్స్, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. (జ.1843).
డిసెంబరు 10 ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833).