ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు. భారత్ మూలం
  • జనవరి 1 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. భారత్ మూలం
  • జూన్ 15 యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్. మూలం
  • జూన్ 20 కెనడా లోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్‌ చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం. మూలం
  • జూలై 23 మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు. మూలం
  • జూలై 23 మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది. మూలం
  • ఆగస్టు 10 రైలు ప్రయాణాన్ని, మొదటిసారిగా, టెలిఫోన్ వాడుతూ (నియంత్రిస్తూ) పంపించారు.సిడ్నీ మైన్స్ రైల్వే దగ్గర ఉన్న, గ్లేస్ బేలో ఉన్నటువంటి, కాలెడోనియా మైన్ (గని) వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ గని యజమానులలో, ఒకడైన, అలెగ్జాండర్ గ్రాహంబెల్ మామగారైన, గార్డినెర్ జి. హబ్బర్డ్, రెండు టెలిఫోన్లు పెట్టి, వాటి ద్వారా రైలు ప్రయాణాన్ని నియంత్రించాడు. మూలం
  • నవంబరు 29 థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది. మూలం

జననాలు

  • మే 18 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923). మూలం
  • జూన్ 6 ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (మ.1949). మూలం
  • జూలై 11 అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949). మూలం
  • జూలై 29 కవాయ్ మిచి, జపనీస్ విద్యావేత్త. మూలం
  • ఆగస్టు 1 షార్లెట్ మారియన్ హుఘ్స్, బ్రిటన్ లోని క్లీవ్ లాండ్ (మార్స్క్) అనే చోట 1 ఆగష్టు 1877 న జన్మించి 1989లో బ్రిటన్ లోని పురాతన వ్యక్తిగా తన 112వ పుట్టిన రోజు చేసుకున్నది. ఈమె పుట్టిన రోజున అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన మొదటి టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. అదే సంవత్సరం మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్, వింబుల్డన్ వద్ద జరిగింది. అప్పటికి క్వీన్ విక్టోరియా భారతదేశపు మహారాణిగా ఉంది. భారత్ మూలం
  • అక్టోబరు 14 వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937). మూలం
  • నవంబరు 5 పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950). భారత్ మూలం
  • నవంబరు 9 ముహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ, పారశీ భాషలలో కవి. మూలం
  • డిసెంబరు 4 ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958). మూలం
  • డిసెంబరు 10 రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తి. (మ.1910). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 11 tewiki:జూలై_11 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: డిసెంబరు 4 tewiki:డిసెంబరు_4 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0