ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 5 జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం. భారత్ మూలం
  • జనవరి 6 బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం. భారత్ మూలం
  • జనవరి 9 ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. మూలం
  • జనవరి 20 అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూలం
  • జనవరి 28 పవన్ కళ్యాణ్ నటి రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. మూలం
  • జనవరి 31 ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్ కు చెందిన యూకీ బాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 19 మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూలం
  • ఫిబ్రవరి 23 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. భారత్ మూలం
  • మార్చి 3 పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. మూలం
  • మార్చి 6 న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. భారత్ మూలం
  • మార్చి 7 మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది. మూలం
  • మార్చి 11 వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. భారత్ మూలం
  • మార్చి 22 జానపద చిత్రాల కథానాయకుడు 'కత్తుల' కాంతారావు క్యాన్సర్ వ్యాధితో హైదరాబాదు యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. మూలం
  • మార్చి 26 ఎన్నికల ప్రచారం అనంతరం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్.టి.ఆర్ గాయపడ్డారు. మూలం
  • ఏప్రిల్ 12 థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది. మూలం
  • ఏప్రిల్ 19 భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. భారత్ మూలం
  • మే 20 ఇండోనేషియాలో విమానం కూలి 100 మంది మరణించారు. మూలం
  • మే 20 వై.ఎస్.రాజశేఖరరెడ్డి వరుసగా రెండో పర్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూలం
  • మే 22 భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు. (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు). భారత్ మూలం
  • మే 23 ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది. మూలం
  • మే 26 ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది. మూలం
  • జూన్ 14 ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు. మూలం
  • జూన్ 19 32 సంవత్సరముల అనంతరం భారతదేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది. భారత్ మూలం
  • జూన్ 21 ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. భారత్ మూలం
  • జూలై 2 స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది. భారత్ మూలం
  • జూలై 3 మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశపెట్టారు. మూలం
  • జూలై 25 దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది. మూలం
  • జూలై 30 మగధీర సంగీతానికి కీరవాణి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నారు. మూలం
  • జూలై 30 రాజమౌళి తీసిన మగధీర అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రంగా నిలిచి ఆయనకు నంది, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారాలు తెచ్చింది. మూలం
  • జూలై 30 రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మగధీర సంచలన విజయం సాధించి, ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. మూలం
  • ఆగస్టు 2 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది. మూలం
  • ఆగస్టు 2 ఎయిడ్స్ (AIDS) కలిగించే కొత్తరకం వైరస్ ను, కామెరూన్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళలో కనుగొన్నారు. మూలం
  • ఆగస్టు 4 క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. మూలం
  • ఆగస్టు 4 తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది. భారత్ మూలం
  • ఆగస్టు 7 ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారం. మూలం
  • ఆగస్టు 10 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. మూలం
  • ఆగస్టు 12 ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. భారత్ మూలం
  • ఆగస్టు 13 భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబైలో మూసివేతలు ప్రారంభించింది. భారత్ మూలం
  • ఆగస్టు 13 మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లో చేర్చేందుకు నిర్ణయించారు. మూలం
  • ఆగస్టు 13 బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది. మూలం
  • సెప్టెంబరు 2 ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల్లో ప్రమాదానికి గురై ఆయన దుర్మరణం చెందారు. మూలం
  • సెప్టెంబరు 3 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు. మూలం
  • సెప్టెంబరు 3 హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహా ఐదుగురు మరణించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. మూలం
  • సెప్టెంబరు 4 కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మూలం
  • సెప్టెంబరు 4 వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంత్యక్రియలు కడప జిల్లా ఇడుపులపాయలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మూలం
  • సెప్టెంబరు 14 విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. మూలం
  • సెప్టెంబరు 15 తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది. మూలం
  • సెప్టెంబరు 19 సోనీ టీవీ కార్యక్రమం '10 కా దమ్'లో శ్రీదేవి అతిథిగా కనిపించారు. భారత్ మూలం
  • సెప్టెంబరు 23 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. భారత్ మూలం
  • సెప్టెంబరు 23 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, '. మూలం
  • సెప్టెంబరు 29 అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల వర్గంలో బిజేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది. మూలం
  • అక్టోబరు 2 తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి. మూలం
  • అక్టోబరు 8 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు. మూలం
  • అక్టోబరు 15 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఎ.బి.ఎన్ అంటే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్‌వర్క్. మూలం
  • అక్టోబరు 19 హైదరాబాదులో పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమైంది. మూలం
  • నవంబరు 29 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు. మూలం
  • నవంబరు 29 తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మూలం
  • డిసెంబరు 3 తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా కాసోజు శ్రీకాంతాచారి నిలిచారు. మూలం
  • డిసెంబరు 8 డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది. మూలం
  • డిసెంబరు 9 అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు. మూలం
  • డిసెంబరు 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారికంగా ప్రకటించారు. భారత్ మూలం
  • డిసెంబరు 17 హైదరాబాదులో కొమరం భీమ్ విగ్రహం నెలకొల్పుతామని ప్రభుత్వం ప్రకటించింది. మూలం
  • డిసెంబరు 19 భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు. భారత్ మూలం
  • డిసెంబరు 23 రాష్ట్రంలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయం వచ్చేవరకు తెలంగాణపై చర్యలు ఉండవని కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం మళ్లీ భగ్గుమంది. భారత్ మూలం
  • డిసెంబరు 26 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు. మూలం
  • డిసెంబరు 30 జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు. మూలం

మరణాలు

  • జనవరి 1 కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947). మూలం
  • జనవరి 6 జీ.ఎం.షా, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • జనవరి 27 ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910). భారత్ మూలం
  • జనవరి 31 నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు (జ.1933). భారత్ మూలం
  • ఫిబ్రవరి 1 రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 19 నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (జ. 1920). మూలం
  • మార్చి 11 విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు. మూలం
  • మార్చి 11 కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952). మూలం
  • మార్చి 22 టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923). మూలం
  • ఏప్రిల్ 27 ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939). భారత్ మూలం
  • ఏప్రిల్ 29 గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929). మూలం
  • మే 12 గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915). భారత్ మూలం
  • జూన్ 7 భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939). మూలం
  • జూన్ 25 మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958). మూలం
  • జూన్ 25 శివచరణ్ మాథుర్, అసోం గవర్నర్ (జ.1926). మూలం
  • జూన్ 27 ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి. భారత్ మూలం
  • జూలై 21 గంగూబాయ్ హంగళ్, హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత. భారత్ మూలం
  • జూలై 25 జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928). భారత్ మూలం
  • జూలై 28 లీలా నాయుడు, నటీమణి, ప్రపంచ సుందరి. (జ.1940). మూలం
  • ఆగస్టు 12 మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927). మూలం
  • ఆగస్టు 13 కార్ల్ వాన్ హేస్స్, అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్. మూలం
  • ఆగస్టు 24 కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు. మూలం
  • సెప్టెంబరు 2 వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949). మూలం
  • సెప్టెంబరు 12 నార్మన్ బోర్లాగ్, హరిత విప్లవ పితామహుడు. మూలం
  • సెప్టెంబరు 12 రాజ్‌సింగ్ దుంగార్పూర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 22 ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (జ.1927). మూలం
  • సెప్టెంబరు 27 రమేష్ బాలశేఖర్, దివంగత శ్రీ నిసర్గదత్త మహారాజ్ శిష్యుడు ఇంకా అలాగే ప్రఖ్యాత అద్వైత మాస్టర్. (జ.1917). మూలం
  • అక్టోబరు 25 తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి (జ.1931). మూలం
  • నవంబరు 9 హరగోవింద్ ఖురానా, నోబెల్‌ బహుమతి గ్రహీత. (జ.1922). మూలం
  • నవంబరు 17 పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1936). భారత్ మూలం
  • డిసెంబరు 3 కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986). మూలం
  • డిసెంబరు 25 అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912). భారత్ మూలం
  • డిసెంబరు 27 నర్రా వేంకటేశ్వర రావు , సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు (జ.1947). మూలం
  • డిసెంబరు 30 విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో సహాయ పాత్రల నటుడు.(జ.1950). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 9 tewiki:జనవరి_9 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 7 tewiki:మార్చి_7 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మార్చి 11 tewiki:మార్చి_11 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: కాంతా రావు (నటుడు) tewiki:కాంతా_రావు_(నటుడు) · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19 tewiki:ఏప్రిల్_19 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: వై.ఎస్.రాజశేఖరరెడ్డి tewiki:వై.ఎస్.రాజశేఖరరెడ్డి · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూన్ 19 tewiki:జూన్_19 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఎం.ఎం.కీరవాణి tewiki:ఎం.ఎం.కీరవాణి · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: రామ్ చ​రణ్ తేజ tewiki:రామ్_చ​రణ్_తేజ · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: శ్రీదేవి (నటి) tewiki:శ్రీదేవి_(నటి) · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 9 tewiki:డిసెంబరు_9 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: కొమరం భీమ్ tewiki:కొమరం_భీమ్ · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 19 tewiki:డిసెంబరు_19 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 27 tewiki:ఏప్రిల్_27 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 29 tewiki:ఏప్రిల్_29 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  70. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  71. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  72. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  73. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  74. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  75. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0
  76. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0
  77. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  78. తెలుగు వికీపీడియా: డిసెంబరు 27 tewiki:డిసెంబరు_27 · CC BY-SA 4.0
  79. వికీడేటా: ఆ ఒక్కడు (Q4661033) wikidata:Q4661033 · CC0 1.0
  80. వికీడేటా: మగధీర (Q1134677) wikidata:Q1134677 · CC0 1.0
  81. వికీడేటా: స్నేహితుడా (Q16254350) wikidata:Q16254350 · CC0 1.0
  82. వికీడేటా: జోష్ (సినిమా) (Q12998142) wikidata:Q12998142 · CC0 1.0
  83. వికీడేటా: నీకు నాకు (Q21204447) wikidata:Q21204447 · CC0 1.0
  84. వికీడేటా: Jaganmohini (Q6122136) wikidata:Q6122136 · CC0 1.0