ఫిబ్రవరి 24 వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.
మూలం
మార్చి 23 రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
మూలం
మే 12 1500 మంది యూదులను 'ఆస్చ్‌విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు' లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.
మూలం
మే 12 అమెరికాకు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటు ముంచేసింది.
మూలం
మే 23 దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు ఇంట జన్మించారు.
మూలం
జూలై 10 నటుడు కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు.
మూలం
జూలై 14 బ్రిటిష్ పాలన నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఆమోదించింది.
భారత్
మూలం
జూలై 22 యూదుల నువార్సా ఘెట్టో నుంచి టెబ్లింకా కు ఒక పద్ధతిగా (రోజుకి 6 వేల నుంచి 7 వేల మందిని) చేరవేయటం (వారిని చంపటానికి. అలా చనిపోయిన వారు ఎంత తక్కువగా చూసినా 3 లక్షలమంది ఉంటారు) మొదలైన రోజు.
మూలం
ఆగస్టు 7 అమెరికా మెరైన్లు గ్వాడల్ కెనాల్ పై దాడి ప్రారంబించారు.
మూలం
ఆగస్టు 8 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, 1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
భారత్
మూలం
ఆగస్టు 8 క్విట్ ఇండియా తీర్మానం ఆమోదం పొందింది; బొంబాయి గొవలియా టాంక్ మైదానంలో గాంధీ 'డూ ఆర్ డై' పిలుపునిచ్చారు.
భారత్
మూలం
ఆగస్టు 13 వాల్ట్ డిస్నీ యొక్క యానిమేటెడ్ ఫీచర్ బాంబి, న్యూయార్క్ నగరంలోని, రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో ప్రదర్శించారు.
మూలం
ఆగస్టు 30 రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్ధము మొదలైంది.
మూలం
జననాలు
జనవరి 1 సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి.పలు దక్షిణాది భాషల్లో కూడా నటించిన నటి (మ.2014).
మూలం
జనవరి 4 మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2015).
మూలం
జనవరి 5 వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (మ.2011).
మూలం
జనవరి 8 స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018).
మూలం
ఏప్రిల్ 14 మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్.
భారత్
మూలం
ఏప్రిల్ 26 కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017).
మూలం
ఏప్రిల్ 28 ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016).
మూలం
మే 23 కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.
మూలం
మే 23 చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు.(మ.2023).
మూలం
మే 24 విజయచందర్ , తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత.
మూలం
మే 26 గణపతి సచ్చిదానంద, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.
భారత్
మూలం
మే 27 కే.వి.విజయేంద్ర ప్రసాద్, రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు.
భారత్
మూలం
మే 31 ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు సభ్యుడు.
భారత్
మూలం
జూన్ 18 రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.
మూలం
జూలై 1 నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (మ. 2020).
భారత్
మూలం
జూలై 7 పి.వేణుగోపాల్, హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు.
మూలం
జూలై 15 నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
మూలం