ఫిబ్రవరి 10 భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
భారత్
ఫిబ్రవరి 18 భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
భారత్
డిసెంబరు 11 నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
డిసెంబరు 27 జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
భారత్
జననాలు
జనవరి 1 ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
జనవరి 17 జార్జ్ స్టిగ్లర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
జనవరి 23 జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009).
ఫిబ్రవరి 4 వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు.
ఫిబ్రవరి 6 అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం. (చిత్రంలో).
ఫిబ్రవరి 22 రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (మ.1980).
ఫిబ్రవరి 24 పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983).
మార్చి 13 శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (మ.1976).