జనవరి 6 తెలంగాణ అంశంపై 505 పేజీల శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది; విభజన రెండో ఉత్తమ ప్రత్యామ్నాయమని పేర్కొంది.
భారత్
జనవరి 20 భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.
భారత్
ఫిబ్రవరి 2 టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
ఫిబ్రవరి 6 చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
ఫిబ్రవరి 12 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31).
ఫిబ్రవరి 17 తెలంగాణ సాధన కోసం మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో 16 రోజుల సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది.
ఫిబ్రవరి 24 శ్రీరామరాజ్యం రచన పూర్తి చేసిన వెంటనే ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చెన్నైలో కన్నుమూశారు.
మార్చి 10 తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చి జరిగింది; ఆంక్షలు దాటి సుమారు 50 వేల మంది చేరుకున్నారు.
మార్చి 31 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.
భారత్
ఏప్రిల్ 9 అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
ఏప్రిల్ 25 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు.
భారత్
మే 5 జూనియర్ ఎన్.టి.ఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం హైదరాబాద్‌లో జరిగింది.
మే 10 పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని) భారతదేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య).
భారత్
మే 13 మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది.
భారత్
మే 18 స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.
మే 20 పశ్చిమ బెంగాల్‌లో 34ఏళ్ళ సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది.
భారత్
ఆగస్టు 12 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
ఆగస్టు 13 రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; సింహాచలం అప్పన్నకు కరాళచందనం సమర్పించే రోజు.
ఆగస్టు 18 నేడు, లోక్‌సభ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.
భారత్
ఆగస్టు 18 జిప్మెర్, పుదుచ్చెర్రీ చట్టము 2008కి సవరణగా, ప్రతిపాదించిన, జిప్మెర్ (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), పుదుచ్చెర్రీ (సవరణ) బిల్లు 2011 ని, లోక్‍సభ ఆమోదించింది.
ఆగస్టు 18 రాజ్యసభ, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. 1990లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.
భారత్
ఆగస్టు 18 పాఠశాల విద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
ఆగస్టు 18 సాధారణ వర్గానికి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్థులు 27 శాతంరిజర్వేషన్లు కోటా కింద ప్రవేశానికి అర్హులు అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.
ఆగస్టు 19 ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
ఆగస్టు 19 దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు.
భారత్
సెప్టెంబరు 13 తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికుల భాగస్వామ్యంతో సకల జనుల సమ్మె ప్రారంభమైంది.
సెప్టెంబరు 29 దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన 269 మంది అధికారులను, వారిలో అత్యాచార ఆరోపణ రుజువయ్యిన 17 మందిని వాచ్చాతి కేసులో ధర్మపురి జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
అక్టోబరు 24 తెలంగాణ సాధన కోసం 42 రోజుల పాటు సాగిన చరిత్రాత్మక సకల జనుల సమ్మె ముగిసింది.
నవంబరు 28 బాపు దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రానికి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక ప్రదర్శన జరిగింది.
భారత్
డిసెంబరు 28 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ కన్నుమూశారు.
మరణాలు
జనవరి 2 గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
జనవరి 6 ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (జ.1922).
జనవరి 21 ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958).
ఫిబ్రవరి 19 వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు.
భారత్
ఫిబ్రవరి 20 మలేషియా వాసు దేవన్, నేపథ్య గాయకుడు, (జ .1944).
ఫిబ్రవరి 21 ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.
ఫిబ్రవరి 22 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916).
ఫిబ్రవరి 24 ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931).
మార్చి 30 నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945).
ఏప్రిల్ 6 సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952).
భారత్
ఏప్రిల్ 14 రామిరెడ్డి (అంకుశం రామిరెడ్డి) దక్షిణ భారత చలన చిత్రాల ప్రతినాయకుడు.
భారత్
ఏప్రిల్ 24 సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926).
భారత్
ఏప్రిల్ 30 దోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1955).
మే 2 బిన్ లాడెన్ ను అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.
మే 5 క్లాడ్ ఛౌల్స్ (బ్రిటన్ లో పుట్టాడు) 110వ సంవత్సరాల వయసులో పశ్చిమ ఆస్ట్రేలియాలో మరణించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీ తరపున పోరాడి, 2011 మే 5 వరకు బ్రతికిన చివరి యోధుడు. (జ. 1901).
జూన్ 3 కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933).
జూన్ 7 నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933).
జూన్ 9 ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరుగాంచిన భారతీయ చిత్రకారుడు. (జ.1915).
భారత్
జూన్ 21 కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934).
జూలై 4 వి.ఆర్.ప్రతాప్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
జూలై 26 కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929).
ఆగస్టు 3 వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942).