ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సిరివెన్నెల సీతారామశాస్త్రి

జయంతి · 1955 మూలం

టంగుటూరి ప్రకాశం పంతులు

వర్ధంతి · 1957 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ తేనెటీగల దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1913 గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. మూలం
  • 1957 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు హైదరాబాదులో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1970 వాసిరెడ్డి శ్రీనివాస్,సుప్రసిద్ధ జర్నలిస్టు,తెలుగు గేట్ వే స్థాపకుడు. మూలం
  • 1983 తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1994 మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2009 వై.ఎస్.రాజశేఖరరెడ్డి వరుసగా రెండో పర్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2012 గుంటూరు జిల్లాలోని, రెంటచింతలలో 47 డిగ్రీల సెంటిగ్రేడ్ (116.6 డిగ్రీల ఫారెన్ హీట్ ) వేడి. మూలం
  • 2012 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2012 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2012 మే 20 ఆదివారం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం,తిరుపతి నగరాల్లోని 101 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 48,178 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావచ్చును. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండో పరీక్ష జరిగింది. మూలం

సంఘటనలు

  • 325 మొదటి క్రిస్టియన్ క్రైస్తవ సంబంధ మండలి ఆసియా మైనర్ లోని నికా దగ్గర మొదలైంది. మూలం
  • 526 సిరియా లోని ఏంటియోచ్ లో జరిగిన భూకంపంలో 2,50,000 మంది మరణించారు. మూలం
  • 1259 హెన్రీ III, ఇంగ్లాండ్ రాజు, ఫ్రాన్స్కు నార్మండీని ఇచ్చేసాడు. మూలం
  • 1277 పోప్ జాన్ XXI మరణించాడు. మూలం
  • 1293 జపాన్ లోని కమకురాలో జరిగిన భూకంపంలో 30,000 మంది మరణించారు. మూలం
  • 1302 ఇంగ్లాండ్, గాస్కోనీ తిరిగి గెలుచుకుంది. మూలం
  • 1498 భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. భారత్ మూలం
  • 1537 హీరోనిమస్ ఫాబ్రిసియస్ అబ్ ఆక్వాపెండెంటె, సర్జన్, శరీర నిర్మాణ శాస్త్రవేత్త పుట్టాడు (మన శుశృతుడు లాగ). మూలం
  • 1553 మూడు ఆంగ్ల నౌకలు. వాయవ్య మార్గమును వెదుకుతూ ప్రయాణం చేసాయి. మూలం
  • 1609 థామస్ తోర్పె విలియం, షేక్స్పియర్ రచించిన సాన్నెట్ లను (ఇంగ్లీష్ భాషలో రచించే ప్రశ్న, జవాబుతో కూడిన పద్యము). ముద్రించాడు. బెంగాలీ రచయిత్రి తోరు దత్ ఈ సాన్నెట్లు రచించింది. మూలం
  • 1622 ఉస్మాన్ II, ఒట్టోమన్ సుల్తాన్, అధికారము నుంచి, తొలగించి, హత్య చేసారు. మూలం
  • 1639 మొదటి అమెరికన్ ప్రభుత్వ పాఠశాల డోర్చెస్టెర్ (మసాచుసెట్స్ రాష్ట్రము) లో ఏర్పాటు, చేసారు. మూలం
  • 1830 మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్), "బాల్టిమోర్ అమెరికన్" వార్తాపత్రిక లో, ప్రచురించబడింది. మూలం
  • 1875 'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించారు. మూలం
  • 1899 జాకబ్ జర్మన్ అనే న్యూయార్క్ నగరవాసి, టాక్సి కేబ్ ని, నిర్దేశించిన, గంటకు 12 మైళ్ళ వేగాన్ని, మించి, అతివేగంగా, నడుపుతున్నందుకు లెక్సింగ్టన్ అవెన్యూలో అరెస్టు చేసారు. అతివేగంగా నడుపుతూ అరెస్ట్ అయిన మొదటి డ్రైవర్ అతడే. మూలం
  • 1902 అమెరికా, క్యూబా ఆక్రమణకు ముగింపు పలికింది. మూలం
  • 1950 అమెరికాలో "సైనిక దళాల రోజు (ఆర్మ్ డ్ ఫోర్సె డే), నిజానికి "ఆర్మీ డే" 1950 నుండి మే మూడవ శనివారం జరుపుకుంటున్నారు. మూలం
  • 1972 కామెరూన్ రాజ్యాంగ దినం. మూలం
  • 1989 చైనీస్ ప్రీమియర్ లి, తియాన్మెన్ స్క్వేర్లో ఉధృతమైన విద్యార్థి ప్రదర్శనలకు, ప్రతిస్పందనగా బీజింగ్లో యుద్ధ చట్టం (మార్షల్ లా) ప్రకటించాడు. మూలం
  • 1990 హబుల్ స్పేస్ టెలిస్కోప్ మొదటి ఛాయాచిత్రాలను భూమికి పంపింది. మూలం
  • 1992 భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతంగా ప్రయోగించింది. భారత్ మూలం
  • 1999 15 ఏళ్ల బాలుడు, కన్యేర్స్ లోని హెరిటేజ్ హై స్కూల్ లో, తుపాకితో కాల్పులు జరపగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. మూలం
  • 2006 గ్వాంటనామా బే నిర్బంధ శిబిరం వద్ద అల్లర్లు జరిగాయి. మూలం
  • 2007 డేవిడ్ హిక్స్ను గ్వాంటనామా బే నుంచి ఆస్ట్రేలియా జైలుకి బదిలీ చేసారు. మూలం
  • 2008 తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు. మూలం
  • 2009 ఇండోనేషియాలో విమానం కూలి 100 మంది మరణించారు. మూలం
  • 2010 యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది. మూలం
  • 2011 పశ్చిమ బెంగాల్‌లో 34ఏళ్ళ సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది. భారత్ మూలం

జననాలు

  • 1896 అబ్బూరి రామకృష్ణారావు, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది (మ.1979). మూలం
  • 1913 విలియం హ్యూలెట్, హ్యూలెట్ పాకార్డ్ కంపెనీ సహ-స్థాపకుడు (మ.2001). మూలం
  • 1915 మోషే డయన్, ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్, రాజకీయనాయకుడు. ఇజ్రాయెల్ ను ప్రపంచపటం నుంచి తొలగిస్తామన్న ఆరబ్ దేశాలను గడ గడలాడించి, ఓడించిన ఇజ్రాయెల్ దేశపు సింహం (మ.1981). మూలం
  • 1933 జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు (మ.2016). మూలం
  • 1939 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ ఛాయాగ్రహకుడు, దర్శకుడు (మ.2014). భారత్ మూలం
  • 1944 దూడం నాంపల్లి, అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు (మ.2013). మూలం
  • 1955 సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ గీతరచయిత. మూలం
  • 1967 వనమాలి: తెలుగు సినీ గీతరచయిత. మూలం
  • 1970 పరిటాల సునీత, ప్రస్తుతము రాప్తాడు నియోజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు, మంత్రిపదవి నిర్వహిస్తున్నారు. మూలం
  • 1970 వాసిరెడ్డి శ్రీనివాస్,సుప్రసిద్ధ జర్నలిస్టు,తెలుగు గేట్ వే స్థాపకుడు. మూలం
  • 1978 పి.టి.ఉష, భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి. భారత్ మూలం
  • 1979 వేణు శ్రీరామ్ , చిత్ర దర్శకుడు. మూలం
  • 1983 జూనియర్ ఎన్.టి.ఆర్, తెలుగు సినిమా నటుడు. మూలం
  • 1984 మంచు మనోజ్ కుమార్, తెలుగు సినిమా నటుడు. మూలం

మరణాలు

  • 1506 క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్.తి. (జ.1451). మూలం
  • 1932 బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు (జ.1858). భారత్ మూలం
  • 1957 టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి (జ.1872). మూలం
  • 1989 జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త (జ.1904). మూలం
  • 1994 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909). మూలం
  • 1998 ఫ్రాంక్ సినట్రా, హాలీవుడ్ నటుడు (జ.1915). మూలం
  • 2021 యు.విశ్వేశ్వర రావు , తెలుగు సినీ నిర్మాత,దర్శకుడు. మూలం

సినిమా

  • 2022 'ధగడ్ సాంబ' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం. మూలం
  • ప్రపంచ తేనెటీగ దినోత్సవం. మూలం
  • తెలుగు కార్టునిస్టుల దినోత్సవం. మూలం
  • 1819: ‍కెనడా విజయదినం. (సోమవారం). మూలం
  • 1902: క్యూబా స్వతంత్ర దినం. మూలం
  • 1927: సౌదీ అరేబియా స్వతంత్ర దినం. మూలం
  • 1979: మృతవీరుల దినం (కంబోడియాలో). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: టంగుటూరి ప్రకాశం tewiki:టంగుటూరి_ప్రకాశం · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: కాసు బ్రహ్మానందరెడ్డి tewiki:కాసు_బ్రహ్మానందరెడ్డి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: వై.ఎస్.రాజశేఖరరెడ్డి tewiki:వై.ఎస్.రాజశేఖరరెడ్డి · CC BY-SA 4.0
  6. వికీడేటా: ధగడ్ సాంబ (Q125954851) wikidata:Q125954851 · CC0 1.0
  7. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0