ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కాకునూరి అప్పకవి

జయంతి · 1656 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1777 మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు. మూలం
  • 1858 విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు. మూలం
  • 1907 పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది. మూలం
  • 1914 కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది. మూలం
  • 1957 తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు. మూలం
  • 1958 మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది. మూలం
  • 1978 ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది. మూలం
  • 1990 నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది. మూలం
  • 2003 అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది. మూలం
  • 2008 హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు. మూలం

జననాలు

  • 1656 కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. 'ఆంధ్రశబ్ద చింతామణి ' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి ' అను ఛందో గ్రంథానికి రచయిత. మూలం
  • 1886 మైథిలీ శరణ్ గుప్త, హిందీ రచయిత (మ.1964). భారత్ మూలం
  • 1913 శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013). మూలం
  • 1921 లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003). భారత్ మూలం
  • 1931 సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త (మ.1984). మూలం
  • 1948 వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి. మూలం
  • 1956 టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి. మూలం
  • 1983 ఆషీమా భల్లా , హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, అస్సామీ చిత్రాల నటి. మూలం
  • 1989 గౌరినంద , మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల నటి. మూలం

మరణాలు

  • 2008 పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి. మూలం
  • 2011 వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942). మూలం
  • 2013 ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928). మూలం
  • 2013 ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933). మూలం
  • 2017 జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు. భారత్ మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు). మూలం
  • 1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు). మూలం
  • 1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము. మూలం
  • జాతీయ పుచ్చకాయ దినోత్సవము. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: వాణిశ్రీ tewiki:వాణిశ్రీ · CC BY-SA 4.0