ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 11 మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. మూలం
  • జనవరి 11 మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి వెండితెరకు పునరాగమనం చేశారు. మూలం
  • జనవరి 12 అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో విడుదలై ఆయన కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచింది. మూలం
  • జనవరి 16 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తును ప్రకటించారు. మూలం
  • జనవరి 26 భారతదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను పి.వి. సింధు అందుకుంది. మూలం
  • జనవరి 29 బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. మూలం
  • జనవరి 30 భారతదేశంలో తొలి కరోనా వైరస్ కేసు కేరళలో నమోదైంది; అదే రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. భారత్ మూలం 1 మూలం 2
  • మార్చి 2 తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు హైదరాబాదులో నమోదైంది. మూలం
  • మార్చి 8 బీబీసీ సంవత్సరపు భారతీయ మహిళా క్రీడాకారిణిగా పి.వి. సింధు ఎంపికైంది. మూలం
  • మార్చి 11 కోవిడ్-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. మూలం
  • మార్చి 12 ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా వైరస్ కేసు నెల్లూరులో నమోదైంది. మూలం
  • మార్చి 22 కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు. భారత్ మూలం
  • మార్చి 24 కోవిడ్-19 నివారణకు భారతదేశం దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. భారత్ మూలం
  • మే 23 నటి వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్ గుండెపోటుతో మరణించారు. మూలం
  • మే 30 కోవిడ్ యోధులకు నివాళిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన భరత్ భూమి గీతాన్ని ఇళయరాజా విడుదల చేశారు. భారత్ మూలం
  • జూన్ 28 పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాదు పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మూలం
  • ఆగస్టు 5 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 సోకినట్లు ప్రకటించి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. మూలం
  • సెప్టెంబరు 25 నలభై వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మూలం
  • సెప్టెంబరు 26 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్ళూరు జిల్లా తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మూలం
  • సెప్టెంబరు 27 వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి 2020 నవంబరు దాకా కొనసాగింది. మూలం
  • సెప్టెంబరు 30 బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. భారత్ మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 2 ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931). మూలం
  • ఫిబ్రవరి 2 కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944). మూలం
  • ఫిబ్రవరి 16 లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (జ. 1945). మూలం
  • ఫిబ్రవరి 18 కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి. భారత్ మూలం
  • ఏప్రిల్ 9 కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952). మూలం
  • ఏప్రిల్ 23 ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945). భారత్ మూలం
  • ఏప్రిల్ 29 ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1967). భారత్ మూలం
  • ఏప్రిల్ 29 రిషి కపూర్, హిందీ సినిమా నటుడు. (జ.1952). భారత్ మూలం
  • జూన్ 7 చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980). మూలం
  • జూలై 23 ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940). మూలం
  • జూలై 25 మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (జ.1948). మూలం
  • జూలై 26 గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. మూలం
  • జూలై 28 రావి కొండలరావు, సినీ నటుడు,రచయిత , నిర్మాత,దర్శకుడు (జ.1932). మూలం
  • ఆగస్టు 1 పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి. (జ.1961). మూలం
  • ఆగస్టు 4 వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (జ. 1943). మూలం
  • ఆగస్టు 4 సున్నం రాజయ్య, సిపిఎం నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను, తెలంగాణ శాసనసభ లోనూ సభ్యుడు. (జ. 1960). మూలం
  • ఆగస్టు 4 ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ (జ.1925). మూలం
  • ఆగస్టు 6 సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ.1961). మూలం
  • ఆగస్టు 8 నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942). భారత్ మూలం
  • ఆగస్టు 8 మాదన నారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు, తెలంగాణ. (జ.1940). మూలం
  • ఆగస్టు 16 రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940). మూలం
  • ఆగస్టు 18 ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1947). మూలం
  • ఆగస్టు 19 పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(జ.1943). మూలం
  • సెప్టెంబరు 1 మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి. మూలం
  • సెప్టెంబరు 8 జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946). మూలం
  • సెప్టెంబరు 14 కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. మూలం
  • సెప్టెంబరు 23 కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు. మూలం
  • సెప్టెంబరు 25 ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ( జ.1946). మూలం
  • సెప్టెంబరు 27 జస్వంత్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు (జ.1938). మూలం
  • సెప్టెంబరు 29 కె.సి.శివశంకరన్, "శంకర్"గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924). మూలం
  • అక్టోబరు 11 రాజన్ ,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం ) సం గీత దర్శకుడు,(జ.1933). మూలం
  • అక్టోబరు 13 గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947). మూలం
  • అక్టోబరు 14 శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1956). మూలం
  • అక్టోబరు 22 నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ.1934). మూలం
  • నవంబరు 10 జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త. మూలం
  • నవంబరు 11 ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు. మూలం
  • నవంబరు 12 ఏడిద గోపాలరావు, ఆకాశవాణి కళాకారుడు. మూలం
  • నవంబరు 21 దేవీప్రియ, పాత్రికేయుడు, కవి.(జ.1949). మూలం
  • నవంబరు 21 వజ్జా వెంకయ్య: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు (జ. 1926). మూలం
  • డిసెంబరు 1 నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1956). మూలం
  • డిసెంబరు 5 కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938). మూలం
  • డిసెంబరు 23 బాతిక్ బాలయ్య, తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (జ. 1939). మూలం
  • డిసెంబరు 31 నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు. (జ. 1968). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: విజయశాంతి tewiki:విజయశాంతి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అల్లు అర్జున్ tewiki:అల్లు_అర్జున్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: పి.వి. సింధు tewiki:పి.వి._సింధు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  7. English Wikipedia: COVID-19 pandemic in India enwiki:COVID-19_pandemic_in_India · CC BY-SA 4.0
  8. English Wikipedia: COVID-19 pandemic enwiki:COVID-19_pandemic · CC BY-SA 4.0
  9. English Wikipedia: COVID-19 pandemic in Telangana enwiki:COVID-19_pandemic_in_Telangana · CC BY-SA 4.0
  10. English Wikipedia: COVID-19 pandemic in Andhra Pradesh enwiki:COVID-19_pandemic_in_Andhra_Pradesh · CC BY-SA 4.0
  11. English Wikipedia: Janata Curfew enwiki:Janata_Curfew · CC BY-SA 4.0
  12. English Wikipedia: COVID-19 lockdown in India enwiki:COVID-19_lockdown_in_India · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: వాణిశ్రీ tewiki:వాణిశ్రీ · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం tewiki:ఎస్._పి._బాలసుబ్రహ్మణ్యం · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9 tewiki:ఏప్రిల్_9 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 23 tewiki:ఏప్రిల్_23 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 29 tewiki:ఏప్రిల్_29 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 26 tewiki:జూలై_26 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 13 tewiki:అక్టోబరు_13 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 21 tewiki:నవంబరు_21 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  54. వికీడేటా: సరిలేరు నీకెవ్వరు (Q65052126) wikidata:Q65052126 · CC0 1.0
  55. వికీడేటా: అల వైకుంఠపురములో (Q65057760) wikidata:Q65057760 · CC0 1.0
  56. వికీడేటా: Buchinaidu Kandriga (Q124215705) wikidata:Q124215705 · CC0 1.0
  57. వికీడేటా: ఒరేయ్ బుజ్జిగా (Q86754192) wikidata:Q86754192 · CC0 1.0
  58. వికీడేటా: మిస్ ఇండియా (Q96393472) wikidata:Q96393472 · CC0 1.0
  59. వికీడేటా: అనగనగా ఓ అతిథి (Q102213117) wikidata:Q102213117 · CC0 1.0
  60. వికీడేటా: డర్టీ హరి (Q98078841) wikidata:Q98078841 · CC0 1.0
  61. వికీడేటా: మర్డర్ (2020 సినిమా) (Q104830640) wikidata:Q104830640 · CC0 1.0