ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

మల్లాది రామకృష్ణశాస్త్రి

జయంతి · 1905 మూలం

నెల్లై ఎస్. ముత్తు

వర్ధంతి · 2025 మూలం

నముడూరు అప్పలనరసింహం

జయంతి · 1917 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1976 ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు). మూలం
  • 2001 దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు. మూలం

సంఘటనలు

  • ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో 'బ్లూమ్స్ డే' జరువుకుంటారు. మూలం
  • ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో 'యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు. మూలం
  • 1723 స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకం, నేటి 'ఆర్దిక శాస్త్రానికి' పునాది వేసింది. (1790 జూలై 17 మరణం). మూలం
  • 1815 నెపొలియోనిక్ యుధ్దాలు - నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం 'బ్లూఛెర్స్ ' అనబడే ప్రష్యన్ సైన్యాన్ని 'బేటిల్ ఆఫ్ లిగ్నీ' లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు). మూలం
  • 1815 నెపొలియోనిక్ యుద్ధాలు - 'బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్' ఫ్రెంచ్ మార్షల్ 'మైకేల్ నీ' 'ఆంగ్లో-డచ్' సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు). మూలం
  • 1858 సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, 'మొరార్ యుద్ధం - బేటిల్ ఆఫ్ మొరార్' జరిగింది. భారత్ మూలం
  • 1858 అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని 'స్ప్రింగ్ ఫీల్డ్' లో, తన 'హౌస్ డివైడెడ్' ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు. మూలం
  • 1883 ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు. మూలం
  • 1890 'లారెల్ అండ్ హార్డీ' గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని 'లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు. మూలం
  • 1891 జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం. మూలం
  • 1897 'రిపబ్లిక్ ఆఫ్ హవాయి' ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ 'రిపబ్లిక్ ఒఫ్ హవాయి' రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది. మూలం
  • 1903 ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'ఫోర్డ్ కార్లు' తయారు చేసే 'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' అమెరికాలో స్థాపించారు. మూలం
  • 1903 అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, 'రోల్డ్ అముండ్ సెన్' నార్వే లోని 'ఓస్లో' రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు. మూలం
  • 1954 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి. మూలం
  • 1960 ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన 'సైకో' నవల ఈ సినిమాకి ఆధారం. మూలం
  • 1963 లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది. మూలం
  • 1977 'ఒరాకిల్ కార్పొరేషన్' ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు). మూలం

జననాలు

  • 1902 బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2002). మూలం
  • 1903 ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994). మూలం
  • 1905 మల్లాది రామకృష్ణశాస్త్రి , కవి, తెలుగు గీత రచయిత (మ.1965). మూలం
  • 1915 మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (మ.1998). మూలం
  • 1917 నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986). మూలం
  • 1940 ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016). మూలం
  • 1948 ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు. మూలం
  • 1949 విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు. మూలం
  • 1951 పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి. మూలం
  • 1959 వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు. మూలం
  • 1971 టూపాక్ షకూర్ , అమెరికన్ రాప్ కళాకారుడు (మ.1996). మూలం
  • 1977 జాన్ మేయర్, అమెరికా వాద్యకారుడు. మూలం
  • 1978 సుప్రియ యార్లగడ్డ, చలనచిత్ర నటి.(అక్కినేని మనవరాలు ). మూలం
  • 1981 రాహుల్ నంబియార్ , నేపథ్య గాయకుడు. మూలం
  • 1986 అంజలి, తెలుగు చలన చిత్రనటి , మోడల్. మూలం
  • 1994 ఆర్య అంబేద్కర్, మరాఠీ సినీ నేపథ్యగాయని. మూలం

మరణాలు

  • 2025 నెల్లై ఎస్. ముత్తు, తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త, తమిళంలో సైన్స్ ఫిక్షన్ రచయిత. (జ.1922). భారత్ మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ జలపాత దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0