ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఆలూరి బైరాగి

జయంతి · 1925 మూలం

మోహ్రీన్ పిర్జాదా

జయంతి · 1995 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1556 రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్‌ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది. మూలం
  • 1605 బ్రిటిష్‌ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్‌ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్‌ ప్లాట్‌' అంటారు. 'గై ఫాకెస్‌' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్‌ డే'గా జరుపుకుంటారు. భారత్ మూలం
  • 1895 జార్జ్‌ సెల్డెన్‌ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్‌ ఆటోవెుబైల్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు. మూలం
  • 1920 భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది. భారత్ మూలం
  • 1951 పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి. మూలం
  • 1967 ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది. మూలం
  • 1976 ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది. భారత్ మూలం
  • 1976 భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • 1977 భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించాడు. భారత్ మూలం
  • 1989 అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం. మూలం
  • 2013 ఇస్రో తొలి అంగారక యాత్ర మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్)ను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1877 పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950). భారత్ మూలం
  • 1892 జె.బి.ఎస్‌. హాల్డేన్‌, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964). భారత్ మూలం
  • 1925 ఆలూరి బైరాగి, తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978). మూలం
  • 1952 వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి. మూలం
  • 1995 మోహ్రీన్ పిర్జాదా, హిందీ, తెలుగు, చిత్రాల నటి, మోడల్. మూలం

మరణాలు

  • 1972 సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925). మూలం
  • 1987 దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925). మూలం
  • 1993 నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (జ. 1926). మూలం
  • 1995 ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి. భారత్ మూలం
  • 2019 కర్నాటి లక్ష్మీనరసయ్య నటుడు, ప్రయోక్త, దర్శకుడు, జానపద కళాకారుడు. (జ.1927). మూలం

సినిమా

  • 1970 'అల్లుడే మేనల్లుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1982 'తరంగిణి (సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: దాశరథి కృష్ణమాచార్య tewiki:దాశరథి_కృష్ణమాచార్య · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  4. వికీడేటా: అల్లుడే మేనల్లుడు (Q12990839) wikidata:Q12990839 · CC0 1.0
  5. వికీడేటా: తరంగిణి (సినిమా) (Q15702555) wikidata:Q15702555 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0