ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 22 ఆంధ్ర రాష్ట్రోద్యమ ఆద్యుడు, దేశభక్త కొండా వెంకటప్పయ్య పాత గుంటూరులో జన్మించారు.
  • జూన్ 11 ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.
  • ఆగస్టు 10 ట్రాన్సాట్లాంటిక్ కేబుల్ ని, అట్లాంటిక్ మహాసముద్రంలో వేశారు. దీనివలన ఖండాంతర దేశాలకు టెలిఫోన్ సౌకర్యం కలిగింది.
  • సెప్టెంబరు 4 మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.

జననాలు

  • జనవరి 11 మాబెల్ బార్ల్ట్రోప్, బ్రిటిష్ స్థాపకురాలు. భారత్
  • ఫిబ్రవరి 22 కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949).
  • మే 9 గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915). భారత్
  • జూలై 9 పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928). భారత్
  • ఆగస్టు 17 మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు (మ.1911).
  • డిసెంబరు 17 కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు