జీవిత చరిత్రలు
కొండా వెంకటప్పయ్య (Konda Venkatappayya)
1866 – 1949
కొండా వెంకటప్పయ్య 'దేశభక్త' బిరుదాంకితుడైన స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. న్యాయవాదిగా జీవితం ప్రారంభించి కృష్ణా పత్రికను స్థాపించారు. గాంధీజీ చేపట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రదేశంలో నాయకత్వం వహించి పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. మూలం
- జయంతి ఫిబ్రవరి 22 →
- వర్ధంతి ఆగస్టు 15 →
-
1866 ఫిబ్రవరి 22
ఆంధ్ర రాష్ట్రోద్యమ ఆద్యుడు, దేశభక్త కొండా వెంకటప్పయ్య పాత గుంటూరులో జన్మించారు. మూలం
-
1902
కొండా వెంకటప్పయ్య కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించి 1905 వరకు నిర్వహించారు. మూలం
-
1910
బందరులో జాతీయ కళాశాలను కొండా వెంకటప్పయ్య ప్రారంభోత్సవం చేశారు. మూలం
-
1912
నిడదవోలు మహాసభలో కొండా వెంకటప్పయ్య సలహాపై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై తొలి మంతనాలు జరిగాయి. మూలం
-
1913
కొండా వెంకటప్పయ్య సలహా మేరకు బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. మూలం
-
1917
నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర సాధనకు నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. మూలం
-
1918
ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడగా కొండా వెంకటప్పయ్య దానికి తొలి కార్యదర్శి అయ్యారు. మూలం
-
1921 మార్చి 31
కొండా వెంకటప్పయ్య కృషితో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ప్రారంభమయ్యాయి; గాంధీజీ ఆంధ్ర పర్యటన ఆయన ఆధ్వర్యంలోనే సాగింది. మూలం
-
1922
కడలూరు జైలులో ఉండగా కొండా వెంకటప్పయ్య 'డచ్ రిపబ్లిక్' గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. మూలం
-
1923
కాకినాడ మహాసభల సందర్భంగా కొండా వెంకటప్పయ్యను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మూలం
-
1930
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలుశిక్ష విధించారు. మూలం
-
1933
గాంధీజీ ఆంధ్రలో సాగించిన హరిజన యాత్రలో కొండా వెంకటప్పయ్య నిమగ్నులై సేవలందించారు. మూలం
-
1937
మద్రాసు శాసనసభకు ఎన్నికైన కొండా వెంకటప్పయ్య భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన తీర్మానాన్ని ఏకగ్రీవంగా నెగ్గించారు. మూలం
-
1942
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలుశిక్ష విధించారు. మూలం
-
1947
స్వాతంత్ర్యానంతరం పెరిగిన అవినీతిపై కొండా వెంకటప్పయ్య గాంధీజీకి నిర్మొహమాటంగా లేఖ రాశారు. మూలం
-
1949 ఆగస్టు 15
దేశభక్త కొండా వెంకటప్పయ్య దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన స్వర్గస్థులయ్యారు. మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: కొండా వెంకటప్పయ్య
tewiki:కొండా_వెంకటప్పయ్య· CC BY-SA 4.0