మార్చి 21 జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
మార్చి 29 ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.
భారత్
మే 10 భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
భారత్
మే 10 భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
భారత్
మే 10 మీరట్‌లో సిపాయిలు బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు; ఇది 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికింది.
భారత్
జూన్ 20 భారత స్వాతంత్ర్యోద్యమము: 1857 జూన్ 20 నాడు గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది.
భారత్
సెప్టెంబరు 20 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో సుదీర్ఘ ముట్టడి అనంతరం బ్రిటిష్ సైన్యం ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకుంది.
భారత్
జననాలు
ఫిబ్రవరి 22 హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (మ.1894).
మే 13 రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1932).
జూలై 14 మేటాగ్, వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.
సెప్టెంబరు 16 కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (మ.1928).
మరణాలు
ఏప్రిల్ 7 మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.
భారత్
ఏప్రిల్ 8 మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827).
సెప్టెంబరు 18 శంకర్ షా, గోండ్వానా సామ్రాజ్యానికి చెందిన రాజు. స్వాతంత్ర్య పోరాటవీరుడు.
భారత్