ఆనాడు Aanaadu

ప్రస్థానం

జీవిత చరిత్రలు

కృష్ణంరాజు (Krishnam Raju)

1940 – 2022

రెబల్ స్టార్‌గా పేరొందిన కృష్ణంరాజు తెలుగు సినిమా ప్రముఖ కథానాయకుడు, రాజకీయ నాయకుడు. 183కి పైగా చిత్రాల్లో నటించి పలు ఫిల్మ్‌ఫేర్, నంది పురస్కారాలు అందుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికై వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు. మూలం

  1. 1940 జనవరి 20

    రెబల్ స్టార్‌గా పేరొందిన నటుడు కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. మూలం

  2. 1966

    చిలకా గోరింక చిత్రంతో కృష్ణంరాజు తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు. మూలం

  3. 1967

    ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణావతారంలో కృష్ణంరాజు నటించారు. మూలం

  4. 1968

    నేనంటే నేనే చిత్రంలో ప్రతినాయక పాత్రతో కృష్ణంరాజు అందమైన విలన్ ఒరవడికి శ్రీకారం చుట్టారు. మూలం

  5. 1974

    కృష్ణవేణి చిత్రంతో కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ ద్వారా నిర్మాతగా మారారు. మూలం

  6. 1976

    బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప జాతీయ పురస్కారం పొందిన చిత్రంగా నిలిచింది. మూలం

  7. 1977

    అమర దీపం చిత్రానికి కృష్ణంరాజు ఫిల్మ్‌ఫేర్, నంది ఉత్తమ నటుడు పురస్కారాలు పొందారు. మూలం

  8. 1978

    కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య, మన వూరి పాండవులు పది రోజుల వ్యవధిలో విడుదలై బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. మూలం

  9. 1984

    బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి కృష్ణంరాజు ఫిల్మ్‌ఫేర్, నంది ఉత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు. మూలం

  10. 1986

    తాండ్ర పాపారాయుడు చిత్రంలో నటనకు కృష్ణంరాజు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. మూలం

  11. 1996

    నటుడు కృష్ణంరాజు శ్యామలాదేవిని వివాహమాడారు. మూలం

  12. 1998

    కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూలం

  13. 1999

    కృష్ణంరాజు నరసాపురం నియోజకవర్గం నుంచి తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూలం

  14. 2000 సెప్టెంబరు 30

    నటుడు కృష్ణంరాజు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూలం

  15. 2009

    కృష్ణంరాజు బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మూలం

  16. 2014

    నటుడు కృష్ణంరాజు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. మూలం

  17. 2015

    రుద్రమదేవి చిత్రంలో కృష్ణంరాజు గణపతిదేవుడి పాత్రను పోషించారు. మూలం

  18. 2022 మార్చి 11

    కృష్ణంరాజు నటించిన చివరి చిత్రం రాధేశ్యామ్ విడుదలైంది. మూలం

  19. 2022 సెప్టెంబరు 11

    ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు హైదరాబాదులో మరణించారు. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: కృష్ణంరాజు (నటుడు) tewiki:కృష్ణంరాజు_(నటుడు) · CC BY-SA 4.0