జమున
జమున తెలుగు సినిమా అగ్ర కథానాయికల్లో ఒకరు. ఎన్టీఆర్, అక్కినేని వంటి అగ్రనటుల సరసన దాదాపు 198 చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. నటిగానే కాక లోక్‌సభ సభ్యురాలిగా, సామాజిక సేవకురాలిగానూ గుర్తింపు పొందారు.
-
1936 ఆగస్టు 30
ప్రముఖ తెలుగు కథానాయిక జమున కర్ణాటకలోని హంపిలో జన్మించారు.
-
1953
పుట్టిల్లు చిత్రంతో జమున తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు.
-
1955
ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలోని మిస్సమ్మ చిత్రం జమునకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది.
-
1964
మూగ మనసులు చిత్రంలో నటనకు జమున ఫిల్మ్‌ఫేర్ పురస్కారం పొందారు.
-
1965
నటి జమున ప్రొఫెసర్ జూలూరి రమణరావును వివాహమాడారు.
-
1968
హిందీ చిత్రం మిలన్‌కు జమున ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం అందుకున్నారు.
-
1989
జమున రాజమండ్రి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
-
2008
నటి జమున ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు.
-
2021
నటి జమున హైదరాబాదులో జరిగిన సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుకలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
-
2023 జనవరి 27
ప్రఖ్యాత నటి జమున హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.