ఆనాడు

ప్రస్థానం

జయప్రద

జయప్రద తెలుగు, హిందీ సహా ఎనిమిది భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు. రాజమండ్రిలో జన్మించిన ఆమె 'సిరిసిరిమువ్వ', 'సాగరసంగమం' వంటి చిత్రాలతో అపూర్వ ఖ్యాతి గడించారు. సినీ ఉన్నతిలో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజ్యసభ, లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు.

  1. 1962 ఏప్రిల్ 3

    ప్రముఖ నటి జయప్రద (లలితారాణి) రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించారు.

  2. 1976

    ఎం. ప్రభాకరరెడ్డి ద్వారా 'భూమి కోసం' చిత్రంలో ఒక నృత్యగీతంతో జయప్రద చిత్రసీమకు పరిచయమయ్యారు.

  3. 1976

    'అంతులేని కథ' చిత్రంలో నటనకు జయప్రద నంది ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.

  4. 1977

    జయప్రద నటించిన 'అడవి రాముడు' బాక్సాఫీస్ రికార్డులు సృష్టించి ఆమెను అగ్రతారగా నిలిపింది.

  5. 1979

    'సిరిసిరిమువ్వ' హిందీ రీమేక్ 'సర్గమ్'తో జయప్రద బాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగారు.

  6. 1982

    'మేఘసందేశం' చిత్రంలో నటనకు జయప్రద నంది ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్నారు.

  7. 1983

    కె. విశ్వనాథ్ 'సాగరసంగమం'లో నటనకు జయప్రద ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి (తెలుగు) పురస్కారం పొందారు.

  8. 1986

    నటి జయప్రద సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు.

  9. 1994 అక్టోబరు 10

    ఎన్టీఆర్ ఆహ్వానంతో నటి జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు.

  10. 1996

    తెలుగుదేశం పార్టీ తరఫున జయప్రద రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

  11. 2004

    ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి జయప్రద లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  12. 2007

    జయప్రదకు ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

  13. 2008

    జయప్రద ఏఎన్నార్ సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

  14. 2009

    రాంపూర్ నుంచి జయప్రద రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  15. 2010 ఫిబ్రవరి 2

    సమాజ్‌వాదీ పార్టీ నుంచి జయప్రద బహిష్కరణకు గురయ్యారు.

  16. 2011

    మలయాళ చిత్రం 'ప్రణయం'లో జయప్రద నటన విమర్శకుల ప్రశంసలు, పలు పురస్కారాలు అందుకుంది.

  17. 2014 మార్చి 10

    అమర్ సింగ్‌తో కలిసి జయప్రద ఆర్‌ఎల్‌డీ పార్టీలో చేరారు.

  18. 2019 మార్చి 26

    నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు.