జీవిత చరిత్రలు
గుడిపాటి వెంకట చలం (Chalam)
1894 – 1979
చలంగా ప్రసిద్ధులైన గుడిపాటి వెంకట చలం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రచయిత, వేదాంతి. స్త్రీల జీవితాలు, వారు ఎదుర్కొనే హింసలు, స్వేచ్ఛ వంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని మైదానం వంటి సంచలన రచనలు చేశారు. సమాజ బహిష్కరణను ఎదుర్కొని జీవిత చరమాంకంలో అరుణాచలం చేరి రమణ మహర్షి సన్నిధిలో ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు.
-
1894 మే 18
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయిత గుడిపాటి వెంకట చలం మద్రాసు నగరంలో జన్మించారు.
-
1911
చలం పిఠాపురం మహారాజా కళాశాలలో చేరి బ్రహ్మసమాజ భావాల వైపు ఆకర్షితులయ్యారు.
-
1920
టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళ్లిన చలానికి సంఘ బహిష్కరణ ఎదురై పశువుల పాకలో తలదాచుకోవలసి వచ్చింది.
-
1921
చలం రచించిన శశిరేఖ నవల వెలువడింది.
-
1927
స్త్రీ స్వేచ్ఛను ఇతివృత్తంగా చలం రచించిన సంచలన నవల మైదానం వెలువడింది.
-
1950
రచయిత చలం బెజవాడలోని తన ఇంటిని అమ్మి కుటుంబంతో అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి తరలివెళ్లారు.
-
1961
ప్రళయం వస్తుందని ప్రచారం చేసిన చలం తెలిసినవారికి ఉత్తరాలు రాసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని సూచించారు; అటువంటిదేమీ జరగకపోవడంతో నవ్వులపాలయ్యారు.
-
1972
చలం తన ఆత్మకథను చలం అనే పేరుతోనే వెలువరించారు.
-
1979 మే 4
మైదానం వంటి సంచలన రచనలు చేసిన గుడిపాటి వెంకట చలం అరుణాచలంలో కన్నుమూశారు.
-
2005
చలం కథ దోషగుణం ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో గ్రహణం చిత్రం వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందింది.