ఆనాడు Aanaadu

ప్రస్థానం

జీవిత చరిత్రలు

జంధ్యాల (Jandhyala)

1951 – 2001

జంధ్యాల తెలుగు సినిమా ప్రసిద్ధ రచయిత, దర్శకుడు. ఆరోగ్యకరమైన హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచి 'హాస్యబ్రహ్మ'గా ఖ్యాతి గడించారు. వందలాది చిత్రాలకు సంభాషణలు అందించడంతో పాటు నలభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు తెరపై హాస్యాన్ని ప్రధాన ప్రక్రియగా నిలబెట్టారు. మూలం

  1. 1951 జనవరి 14

    హాస్యబ్రహ్మగా పేరొందిన రచయిత, దర్శకుడు జంధ్యాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. మూలం

  2. 1974

    నాటక ప్రదర్శన కోసం మద్రాసు చేరిన జంధ్యాల సినీరంగ ప్రవేశానికి బాటలు వేసుకున్నారు. మూలం

  3. 1976

    జంధ్యాల మాటల రచయితగా పనిచేసిన తొలి చిత్రం దేవుడు చేసిన బొమ్మలు విడుదలైంది. మూలం

  4. 1980

    జంధ్యాల సంభాషణలు సమకూర్చిన శంకరాభరణం చిత్రం విడుదలైంది. మూలం

  5. 1981

    ముద్దమందారం చిత్రంతో జంధ్యాల దర్శకుడిగా మారారు. మూలం

  6. 1983

    జంధ్యాల దర్శకత్వం వహించిన ఆనంద భైరవి చిత్రం జాతీయ, నంది పురస్కారాలు అందుకుంది. మూలం

  7. 1984

    శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి జంధ్యాల ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు దర్శకుడి పురస్కారం అందుకున్నారు. మూలం

  8. 1987

    జంధ్యాల దర్శకత్వంలో అహ నా పెళ్ళంట, పడమటి సంధ్యారాగం చిత్రాలు వచ్చాయి. మూలం

  9. 1988 ఏప్రిల్ 27

    జంధ్యాల దర్శకత్వంలో వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ చిత్రాలు వచ్చాయి. మూలం

  10. 1992

    ఆపద్బాంధవుడు చిత్రానికి జంధ్యాల ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారం పొందారు. మూలం

  11. 1998

    జంధ్యాల దర్శకత్వం వహించిన చివరి చిత్రం విచిత్రం విడుదలైంది. మూలం

  12. 2001 జూన్ 19

    ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. మూలం

  13. 2005

    విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జంధ్యాల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జంధ్యాల tewiki:జంధ్యాల · CC BY-SA 4.0